సబ్జా గింజలతో వేసవిలో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదులుకోరు..

ఎండ దెబ్బ నుంచి తక్షణమే ఉపశమనం కలిగించి.. జీవ క్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి.

పండ్లు, మజ్జిగ, లస్సీలాంటి వాటిలో సబ్జా గింజలు భాగం చేసుకుంటే వేసవి తాపానికి చెక్ పెట్టొచ్చు.

వాహనాలు, గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది.. సబ్జా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.

శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్‌, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

మలబద్ధకాన్ని తగ్గించడంలో సబ్జా గింజలు తోడ్పడుతాయి

మూత్రపిండాల పనితీరు పెంచడం, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడం, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది సహాయ పడుతుంది.

సబ్జా గింజలు ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. సౌందర్య సంరక్షణకు తోడ్పడుతాయి.