ఎర్ర అరటిపండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..

 తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటాయి. దీన్ని తింటే ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో ఉంటుంది.

  పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు రాకుండా నియంత్రిస్తుంది.

కాల్షియం మెండుగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

ఎర్ర అరటిపండుతో ఫేస్ మాస్క్ వేసుకుంటే చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి. ముఖ చర్మం బిగుతుగా మారుతుంది.

నెలసరి సమయంలో కడుపునొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్-బి6 పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ ను మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎర్ర అరటిపండు తింటే హృదయ స్పందనను నియంత్రించి ఒత్తిడి తగ్గిస్తుంది.

రేచీకిటి ఉన్నవారు ఎర్ర అరటిపండు తింటే సమస్య తగ్గుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి బాగా సహాయపడుతుంది.