తలనొప్పి రాగానే చాలా మంది వివిధ రకాల మందులు వేసుకుంటుంటారు. అయితే ఏ మందూ తీసుకోకుండా నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా అప్పుడప్పుడూ ఓ గ్లాసు నీరు తీసుకుంటూ ఉండాలి.
కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లను ఎక్కువ సేపు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగించినా మధ్యలో కళ్లపై నీళ్లు చల్లుకోవాలి.
ఘాటైన వాసన పడని వారు.. రూమ్ ఫ్రెష్‌నర్, అగరబత్తులు నుంచి తచ్చే ఘాటైన వాసనకు దూరంగా ఉండాలి.
తలనొప్పి సమస్య ఉన్న వారు కెఫిన్ ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. బదులుగా మజ్జిగ, చక్కెర లేని పానీయాలను తీసుకోవాలి.
తలనొప్పి ఉన్న సమయంలో ద్రాక్ష జ్యూస్ తాగితే వెంటనే తగ్గుతుంది. ఇందులోని ప్రత్యేక విటమిన్స్, మినరల్స్ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి.
సరైన నిద్రలేకపోయినా తలనొప్పి రావొచ్చు. కాబట్టి రాత్రిళ్లు 6నుంచి 8గంటల లోపు నిద్రపోవాలి.
తలనొప్పి తగ్గకపోతే కళ్లు మూసుకుని కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వ
ైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే.. ఏం జరుగుతుందంటే..!
ఉదయం టిఫిన్ చేయట్లేదా.. తస్మాత్ జాగ్రత్త!
ప్రపంచంలోని 10 అత్యుత్తమ ఆల్కహాల్ లేని పానీయాలు ఇవే..
రాత్రిళ్లు ఈ ఆహారం తింటే.. ఊబకాయం వస్తుంది జాగ్రత్త..!