సీజనల్ వ్యాధులకు  సగ్గు బియ్యంతో చెక్

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధులను అడ్డుకుని రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సగ్గుబియ్యం బాగా ఉపయోగపడుతుంది.

సగ్గుబియ్యంలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. వీటిల్లో ఉండే పోషకాలు కండరాలకు బలాన్నిస్తాయి. అంతేకాకుండా బీపీ అదుపులో ఉంటుంది.

విటమిన్ బి, కె, జింక్, ప్రొటీన్, ఫైబర్, ఐరన్ వంటి అనేక పోషకాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. 

సగ్గుబియ్యం తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. బరువు తగ్గాలనుకునే ఇది బెస్ట్ ఆప్షన్.

సగ్గుబియ్యాన్ని  జావలాగా చేసుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. 

జీర్ణవ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. 

కడుపు ఉబ్బరం, విరేచనాలతో ఇబ్బంది పడేవారికి సగ్గుబియ్యం ఔషధంలా పని చేస్తాయి.

విటమిన్ కె మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తరచూ సగ్గుబియ్యం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.