భోజనం తరువాత బెల్లం, నెయ్యి కలిపి తింటే ఏకంగా 7 లాభాలు..
బెల్లం, నెయ్యి జీర్ణక్రియకు సహాయపడతాయి.
నెయ్యిలో జీర్ణాన్ని ప్రేరేపించే ఎంజైమ్ లు ఉంటాయి. బెల్లం కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం తగ్గిస్తుంది.
భోజనం తరువాత తీపి తినాలని అనిపించేవారికి ఇది సంతృప్తిని ఇస్తుంది.
బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి. రెండూ కలిసి మంచి పోషకాహారంగా మారతాయి.
చక్కెరతో పోలిస్తే బెల్లం సేఫ్. రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా, నిలకడగా ఉండటంలో బెల్లం సహాయపడుతుంది.
బెల్లం, నెయ్యి గొంతు సమస్యలకు, శ్వాసకోశ ఆరోగ్యానికి మంచిది. ఆయుర్వేదంలో ఇది సాంప్రదాయ ఆహారం.
బెల్లం, నెయ్యి కాంబినేషన్ శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. చలికాలంలో ఇది ఆరోగ్యం చేకూరుస్తుంది.