టీని  మళ్లీ వేడి చేస్తున్నారా.. ఆయుర్వేదం చెప్పిన ఈ నిజాలు తెలిస్తే..

టీ భారతీయులకు ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. ఉదయాన్నే టీ తాగకపోతే చాలామంది పనులు మొదలు పెట్టలేరు.

చాలామంది టీని తయారు చేసి తాగాలని అనిపించినప్పుడు వేడి చేసుకుని తాగుతుంటారు.

టీని ఇలా మళ్ళీ వేడి చేయడం గురించి ఆయుర్వేదం షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

టీని మళ్లీ వేడి చేయడం వల్ల  టీలో టానిన్లు అధికంగా విడుదల అవుతాయి.  ఇది శరీరాన్ని ఐరన్ గ్రహించకుండా చేస్తుంది.  ఐరన్ లోపానికి కారణం అవుతుంది.

టీని మళ్లీ వేడి చేసినప్పుడు కెఫిన్ శాతం పెరుగుతుంది.  ఇది శరీరాన్ని డీహైడ్రేట్  చేస్తుంది.

ఎక్కువ కెఫిన్ ఉన్న టీని తాగడం వల్ల మూత్ర సంబంధ సమస్యలు పెరుగుతాయి.

టీని మళ్లీ వేడి చేయడం వల్ల ఎసిడిటీ,  పొట్ట సంబంధ సమస్యలు వస్తాయి.

టీ ని ఎక్కువ ఉడికించినప్పుడు టీలో ఆమ్ల స్వభావం పెరుగుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది.

పాలతో చేసిన టీని మళ్లీ వేడి చేసి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ సమస్యలు ఏర్పడతాయి.

టీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదంటే 3-5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించకూడదు.