చల్లని నీరు తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

వేసవిలో చాలామంది ఫ్రిడ్జ్ నీళ్లు తాగుతారు. ఈ నీరు తాగితే.. చల్లగా ఉంటుందని భావిస్తారు. కానీ.. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

చల్లని నీరు తాగితే కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా.. జీర్ణ సమస్యలొస్తాయి.

ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని నీరు తాగితే.. అది నేరుగా మెదడపై ఎఫెక్ట్ చూపుతుంది. తద్వారా.. తలనొప్పి, సైనస్ వంటి సమస్యలు వస్తాయి.

చల్లని నీరు తాగితే గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలొస్తాయి. ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి.. గొంతు, ముక్కులో రద్దీ ఏర్పడుతుంది.

చల్లటి నీరు.. బాడీలో ముఖ్య భాగమైన నాడీ వ్యవస్థపై ఎఫెక్ట్ చూపుతుందని, దీంతో గుండె వేగం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది.

చల్లని నీరు తాగితే.. దంతాల్లోని నరాలు దెబ్బతిని, దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది. అప్పుడు అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది.

చల్లని నీరు తీసుకుంటే.. శరీరంలో జరిగే జీవక్రియలు మందగించి, అలసటగా అనిపిస్తుంది. బాడీలో శక్తి నశించినట్టుగా అనిపిస్తుంది.