బిస్కెట్లు ఎక్కువగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

చాలామంది స్నాక్స్ రూపంలో బిస్కెట్లను రెగ్యులర్‌గా తింటూ ఉంటారు. వీలు దొరికినప్పుడల్లా టీ లేదా కాఫీతో కలిపి బిస్కెట్లు తింటారు.

అయితే.. బిస్కెట్లను ఇలా రెగ్యులర్‌గా తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

మైదాతో చేసిన బిస్కెట్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ బిస్కెట్లు ఇన్సులిన్‌పై ప్రభావం చూపి.. బరువు పెరగడానికి కారణమవుతాయి.

బిస్కెట్లు ఎక్కువగా తింటే.. శరీరంలో చెడు కొలెస్తిరాల్ పెరిగిపోతుంది. దీంతో.. గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ఒకేసారి ఎక్కువ బిస్కెట్లు తినేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, అజీర్తి వంటి రోగాలు తీవ్రతరమయ్యే ఛాన్స్ ఉంది.

బిస్కెట్లలో చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారు వీటికి తినకూడదు.

టీతో కలిపి బిస్కెట్లను తినడం వల్ల.. హైబీపీ వచ్చే అవకాశం ఉందని వైద్యులంటున్నారు. ఇందుకు కారణం.. ఇందులోని సోడియం కంటెంట్.

బిస్కెట్లకు అలవాటుపడిన వారు.. వాటికి బదులుగా డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌, మఖానా, శనగలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.