ఉదయం టిఫిన్ చేయట్లేదా.. తస్మాత్ జాగ్రత్త!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చాలామంది ఉదయం టిఫిన్ చేయడం లేదు. ఇలా చేస్తే.. దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు.
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే.. శక్తి స్థాయిలు తగ్గి, రోజంతా నీరసంగా ఉంటారు. అప్పుడు ఏ పనిపై కూడా సరిగ్గా దృష్టి సారించలేరు.
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అప్పుడు తృణధాన్యాలు, పండ్లు వంటివి తింటే చాలా మంచిది.
టిఫిన్ చేయకపోతే.. రోజంతా ఆకలిగా అనిపిస్తుంది. ఈ దెబ్బకు అతిగా ఆహారం తినేశారు. ఫలితంగా.. శరీర బరువు పెరిగిపోతుంది.
ఉదయం తినే టిఫిన్ శరీరానికి పోషకాలు అందిస్తుంది. ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. పోషకాహారలోపానికి దారి తీస్తుందని అంటున్నారు.
తరచూ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది.
ఉదయం టిఫిక్ చేయకపోతే.. చిరాకు, నిరాశ ఎదురవుతాయి. ఇది మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఉదయం అల్పాహారం స్కిప్ చేస్తే.. జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది, వెయిట్ మెయింటేనెన్స్ అనేది సవాలుగా మారుతుంది.
Related Web Stories
ప్రపంచంలోని 10 అత్యుత్తమ ఆల్కహాల్ లేని పానీయాలు ఇవే..
రాత్రిళ్లు ఈ ఆహారం తింటే.. ఊబకాయం వస్తుంది జాగ్రత్త..!
ఎండ నుంచి జుట్టు రక్షించుకోండిలా
ఉదయాన్నే ఎండుకొబ్బరి తినడం వల్ల.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..