మహిళల్లో మెనోపాజ్ మొదలైనట్టే కొందరు పురుషులు కూడా ఆండ్రోపాజ్ బారినపడుతుంటారు

శరీరంలో పురుష హర్మోన్ టెస్టెస్టిరాన్ తగ్గడాన్ని ఆండ్రోపాజ్ లేదా పురుషుల మెనోపాజ్ అని అంటారు. 

ఆండ్రోపాజ్ మొదలైనప్పుడు శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే..

లైంగిక సామర్థ్యంతో పాటు ఆసక్తి కూడా తగ్గిపోతుండటం ఆండ్రోపాజ్‌కు ఓ సంకేతం

ఆండ్రోపాజ్ మొదలయ్యాక కొందరిలో నిత్యం నీరసంగా, ఒంట్లో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది

కొందరిని చిరాకు, ఆందోళన, నిరాశ వంటి ప్రతికూల భావనలు ముంచెత్తుతాయి

శారీరక దృఢత్వం తగ్గడంతో పాటు కండరాలు కూడా బలహీనపడతాయి

ఒంట్లో, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది