జీవక్రియలు సజావుగా సాగేందుకు లివర్ కీలకం

కాలేయంలో సమస్య మొదలయ్యే ముందు రాత్రిళ్లు కొన్ని రోగ లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

రాత్రిళ్లు సరిగా నిద్రపట్టట్లేదంటే లివర్‌లో సమస్య ఉండే అవకాశం ఉంది. 

రాత్రిళ్లు అతిగా చెమటలు పట్టడం కూడా కాలేయంలో ఇబ్బంది మొదలైందనేందుకు సంకేతం

మూత్రం ముదురు రంగులో ఉందంటే కాలేయం సమస్య ఉన్నట్టు అనుమానించాలి

ఉదర భాగంలో పలు చోట్ల వాపు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి

మలం లేత పసుపు పచ్చ రంగులో ఉంటే లివర్‌ పనితీరు మందగించినట్టు అనుమానించాలి

నిత్యం అలసటగా ఉన్నా, కామెర్ల లాంటి లక్షణాలు ఉన్నా వైద్యులను తక్షణం సంప్రదించాలి