తలతిరుగుడు తగ్గాలంటే ఈ చిట్కాలు  పాటించండి..

తలతిరగడం (డీజినెస్) తగ్గాలంటే.. ముందు శ్వాసను బాగా లోపలికి తీసుకుని బయటకు వదలాలి. అలా పలుమార్లు చేయాలి.

ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ వల్ల  తలతిరుగుతుంది. దీంతో నీరు ఎక్కువగా తాగాలి. 

అల్లం తీసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క  నమలడం లేదా కొద్దిగా రసంగా కానీ తీసుకొవచ్చు.     

నిమ్మరసం తీసుకుంటే తలతిరుగుడు ప్రభావం తగ్గుతుంది. 

రాతి ఉసిరికాయ తినవచ్చు. 

తేనె తీసుకోవచ్చు. ఇది అప్పటికప్పుడు శక్తిని అందిస్తుంది. 

ఒక వెల్లుల్లి రెబ్బను నమిలి.. నాలుక క్రింది భాగంలో ఉంచుకోవాలి. అలా అయినా తలతిరుగుడు నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా జ్యూస్‌ తీసుకున్నా సరిపోతుంది. 

బాదం, ఆకుకూరలు, నట్స్, లివర్, ఖర్జూరం వంటి ఐరన్ ఫుడ్స్ తరచూ తీసుకోవడం వల్ల తలతిరుగుడు సమస్యను దూరం చేసుకోవచ్చు.