పొట్ట తగ్గాలంటే..  ఏం చేయాలి?

పొట్ట సమస్యను తగ్గించుకోవడానికి ఉపవాసాలు ఉన్నా, జిమ్ చేస్తున్నా.. చాలామందికి తగిన ఫలితం కనిపించట్లేదు.

అలాంటి వాళ్లు జిమ్‌కి వెళ్లకుండానే.. కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. బెల్లి ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

గంటల తరబడి ఒకే చోట కూర్చోకూడదు. ఎక్కువసేపు కూర్చుంటే.. కొవ్వు పేరుకుపోయి, కడుపు ఉబ్బరం వస్తుంది.

ఒకే చోట కూర్చోకుండా మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం చేయాలి. ఇలా తరచూ చేస్తే బరువు అదుపులో ఉంటుంది.

ఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వ్యాయామం చేయాలి. అలాగే క్రికెట్, టెన్నిస్ వంటి క్రీడలాడాలి.

ప్రతి రోజూ తగినన్ని నీళ్లు తాగితే.. అది ఆకలిని తగ్గిస్తుంది. ఫలితంగా.. పొత్తికడుపు కొవ్వు తగ్గి, శరీర బరువు తగ్గుతుంది.

బరువు తగ్గాలంటే.. ఆకుకూరలు, పండ్లు వంటివి తినాలి. ముఖ్యంగా.. అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.

మైదాతో తయారుచేసే ఆహారాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యానికీ దూరంగా ఉండాలి.

రాత్రి 7 గంటలలోపే భోజనం చేయాలి. నిద్రపోవడానికి కనీసం గంట, రెండు గంటల ముందు తింటే.. పొట్ట తగ్గుతుంది.