రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి  నిద్రపోతున్నారా.. అయితే,  ఈ ముప్పు తప్పదు..!

రాత్రంతా ఏసీ పెట్టుకుని పడుకోవడం వల్ల శరీరం ఉదయం చాలా వేడిగా ఉంటుంది.

ఏసీ వల్ల ఉదయానికి శరీరం బిగుసుకుపోయినట్టుగా మారి ఒంటి నొప్పిని కలిగిస్తుంది. 

 ఎక్కువ సమయం ఏసీలో నిద్రించేవారిలో శ్వాస తీసుకోవడంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

దగ్గు, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా గదిలో ఉండే తేమను కూడా తగ్గిస్తుంది.

చర్మం పొడిబారటం, కంటి అలెర్జీలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

ఏసీని తక్కువ సమయం వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

రాత్రిపూట గది ఉష్ణోగ్రత చల్లబడే వరకు ఏసీ ఆన్‌ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఆఫ్ చేసి ఫ్యాన్‌ ఆన్‌ చేసుకోవడం మంచిది.