తలకాయ కూరతో  ఇన్ని లాభాలా...

మేక తలకాయనులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి

రోగ నిరోధశక్తి పెంచడంలో కూడా తలకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఐరన్‌ లోపంతో బాధపడే వారికి తలకాయ కూర ఉపయోపగపడుతుంది

 ఇందులో పుష్కలంగా లభించే ఐరన్‌ రక్త హీనతకు చెక్‌ పెడుతుంది.

 మేక తలకాయ కూరలోని గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తల కాయ కూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

మేక తలకాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి.

ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.