బరువు తగ్గాలనుకుంటున్నారా..  ఈ దోశ తినాల్సిందే

 డైట్ పాడవకుండా బరువు తగ్గేందుకు ఈ దోశ ఉపయోగపడుతుంది

బరువు తగ్గాలనుకునే వారు సొరకాయ దోశను డైట్‌లో  భాగం చేసుకోండి

సొరకాయ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం

కావాల్సిన పదార్థాలు:  మినపప్పు - 200 గ్రాములు రెండు కప్పుల బియ్యం రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు మిరపకాయలు అల్లం వెల్లుల్లి

జీలకర్ర ఇంగువ కొబ్బరి తురుము రుచికి సరిపడా ఉప్పు చిటికెడు తోటకూర పొడి 100 గ్రాముల ఒక సొరకాయ

తయారీ విధానం: బియ్యం, మినపప్పు, చింతపండు  తీసుకుని నీళ్లు పోసి కనీసం 7 గంటలు నానబెట్టాలి.

తర్వాత మిక్సీలో బియ్యం  పిండిలో సగం తీసుకుని  సొరకాయ  మినహా మిగిలినవి వేసి రుబ్బుకోవాలి

మిగిలిన సగం బియ్యం  మిశ్రమంలో సొరకాయ ముక్కలు  వేసి రుబ్బుకోవాలి. వేర్వేరుగా రుబ్బుకున్న పిండి మిశ్రమాన్ని ఒక దగ్గర వేసి బాగా కలపాలి.

స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్  వేసి.. పిండిని దోశగా  వేసుకోవాలి.. రెండు వైపులా కాల్చుకుంటే రుచికరమైన సోరకాయ దోశ రెడీ.