ఆరోగ్యకరమైన ఆఫీస్ టిఫిస్స్ ఇవే.. ఈ స్నాక్స్‌కి నూనె అవసరం లేదు..!

ఉడకబెట్టిన రాజ్మా తరిగిన బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు, టమాటాలతో, ఉప్పు, మిరియాలు, నిమ్మరసంతో కలిపి తింటే మంచి రుచితో ఉంటుంది.

దక్షిణ భారత ఇడ్లీలు మరొక అద్భుతమైన స్నాక్. పులియబెట్టిన బియ్యం, పప్పు పిండితో తయారు చేస్తారు.. ఇది మంచి రుచేకాదు.. బలం కూడా..,

ఆపిల్, బేరి, నారింజ, దానిమ్మ వంటి వివిధ రకాల తరిగిన పండ్లను కలిపి తీసుకుంటే సూపర్ స్నాక్. ఇందులో రుచిని మెరుగుపరచడానికి కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం కలిపితే చాలు.

నూనె లేని అల్పాహారం కోసం గోధుమలు, మల్టీగ్రెయిన్ బ్రెడ్‌ని ఉపయోగించండి. ఇందులో దోసకాయ ముక్కలు, టమాటాలు, అవకాడో ముక్కలతో పొరలుగా వేసి తింటే చక్కని టేస్ట్.

పాన్‌లో కొన్ని చనా లేదా చిక్‌పీస్ కరకరలాడే వరకు పొడిగా వేయించాలి. ప్రోటీన్ కోసం ఉప్పు, మిరియాలు, కలిపితే ఇష్టమైన స్నాక్ తయారైనట్టు..

బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బఠానీలు, మసాలా ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయవచ్చు. 

క్యారెట్, బీట్‌రూట్‌లను తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కలపండి. మంచి రుచి, మంచి శక్తిని ఇస్తుంది.

చిలగడదుంపలను ఉడకబెట్టాలి ఇందులో దోసకాయ, దానిమ్మ గింజలు, చాట్ మసాలా, జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులతో తినండి.

మొలకెత్తిన మూంగ్ బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.