చక్కెర ఎక్కువ తింటున్నారనడానికి 7 లక్షణాలు..

చక్కెర ఎక్కువ తింటున్నారనడానికి 7 లక్షణాలు..

పదే పదే తీపి తినాలనిపిస్తుంటే ఈ లక్షణాలను గమనించి నియంత్రించుకోవాలి.

 కేవలం ఉప్పే కాదు తీపి పదార్థాలు కూడా రక్తపోటును ప్రభావితం చేస్తాయి. రక్తపోటు 120/80 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ముప్పే..

తీపి పదార్థాలు ఎక్కువ తీసుకునేవారిలో నీరసం అధికంగా ఉంటుంది. తీపి పదార్థాలలో పోషకాలు ఏమీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.

తీపి పదార్థాలలో సాధారణంగా ఫైబర్, ప్రోటీన్ ఏమీ ఉండదు. ఇవి నోటికి మంచి అనుభూతి ఇస్తాయి, ఆకలి స్థాయిని పెంచుతాయి. పదే పదే తీపి తినాలని అనిపిస్తుంది.

 స్వీట్లలో ఫైబర్, పోషకాలు, కడుపు నిండిన అనుభూతి కలిగించేవి ఏమీ ఉండవు. కేలరీలు మాత్రం బోలెడు ఉంటాయి. తద్వారా బరువు పెరుగుతారు.

చర్మసంబంధ సమస్యలు చికాకు పెడుతూ ఉంటే ఆహారంలో చక్కెర ఎక్కువ తీసుకుంటున్నారేమో గమనించుకోవాలి. చక్కెర కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

తీపి పదార్థాలు శరీరంలో ఆండ్రోజెన్ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. వీటి కారణంగా మొటిమలు ఏర్పడతాయి.

రాత్రి సమయంలో చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే  నిద్రకు ఆటంకం కలుగుతుంది.  చక్కెర పదార్థాలలో విడుదల అయ్యే శక్తి కలత నిద్రకు కారణం అవుతుంది.