తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

నారింజ, బత్తాయి కాయలోనే కాదు.. కివీ పండులో సైతం విటమిన్ సీ రెట్టింపు మోతాదులో ఉంటుంది. యాపిల్ కంటే 5 రెట్లు అధికంగా ఇందులో పోషకాలుంటాయి.  

వీటిలో పీచు పదార్థం, విటమిన్ ఈ,పొటాషియం,ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు తదితర పోషకాలు కివీ పళ్లలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒక కప్పు కివీ ముక్కలలో.. ఒక రోజుకు సరిపడా విటమిన్‌ సీ లభిస్తుంది.

ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు దోహదపడుతోంది.

పోషకాలు కివీలోనే కాదు.. దాని తొక్కలో కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

కివీ పండు తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కివీ తొక్కలో ఇతర పండ్ల కంటే మూడు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుందని ఓ అధ్యాయనంలో తేలింది.

ఫైబర్.. జీవక్రియను పెంచుతుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది.

కివీ తొక్కలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొవ్వును కరిగిస్తాయి. దీని వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. అధికంగా తినకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

కివీ తొక్క శరీరంలో ఇన్సులిన్‌ను సైతం సమతుల్యం చేస్తుంది. దీనివల్ల అతిగా తినాలనే కోరికను నియంత్రిస్తుంది. వీటిని  తినడం వల్ల మీ బరువు త్వరగా తగ్గుతుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.

కివీ తొక్కను వాడే ముందు బాగా కడగాలి. తర్వాత దాన్ని జ్యూస్‌లా చేసుకోని తాగవచ్చు. అలా కానీ పక్షంలో నమిలి తినవచ్చు.

అలా కూడా చేయలేకుంటే.. కివీ పండు తొక్కను ఎండబెట్టి మెత్తగా చేసుకుని పొడి రూపంలో తీసుకుంటే.. పలు ఆనారోగ్య సమస్యలు దరి చేరవని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.