అందరూ సీజనల్ వ్యాధులు సహా అనేక రకాల అనారోగ్యాల బారిన పడతుండడం తెలిసిందే.
అయితే సరదా కోసం చాలా మంది ఈతకు వెళ్లి అనేక చర్మ సంబంధ సమస్యలు తెచ్చుకుంటారు.
నీటి ద్వారా కేవలం చర్మ సమస్యలే కాదు.. బ్రెయిన్ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
నీటి ద్వారా వచ్చే వ్యాధుల్లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ ఒకటి. ఇది వస్తే వారాల వ్యవధిలో మృతి చెందే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది.
చిన్నపాటి చెరువులు, మురికి స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం వల్ల ఇది వస్తుంది.
ముక్కు ద్వారా శరీరంలోకి అమీబా చేరి నాలుగు రోజుల్లోనే నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది.
అమీబా దాడి చేయడం వల్ల 14 రోజుల వ్యవధిలో మెదడువాపు వచ్చి బాధితుడు మరణిస్తాడు.
మన దేశంలో ఇప్పటివరకూ 22మంది దీని బారిన పడి మృతిచెందారు.
తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, గందరగోళంగా ఉండడం వ్యాధి లక్షణాలు..
నీటి క్లోరినేషన్, చెరువులు, కాలువలకు ఈతకు వెళ్తే నోస్ క్లిప్‌లు వాడడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
ఈత కొట్టేటప్పుడు నోటిని నీటి అడుగున ఉంచవద్దు. ఈత అనంతరం తలనొప్పి, జ్వరం ఉంటే వైద్యుణ్ని సంప్రదించాలి.
Related Web Stories
పనివేళల్లో ఇవి తినడం ఎంతో మంచిది
భోజనం తర్వాత సోంపు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ఈ అలవాట్లు చాలా ప్రమాదకరం!
జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!