మంకీపాక్స్ లక్షణాలివే

ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరిస్తుంది

పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో కూడా మూడు కేసులు నమోదయ్యాయి

అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం

మంకీపాక్స్ సోకిన వారి ఒంటి మీద దద్దుర్లు, జ్వరం వస్తుంది

గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు ఉంటాయి

వెన్నునొప్పి, మనిషి బలహీనపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

పలువురిలో ఎంపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే, మరికొంతమందిలో వేరే రకంగా బయటపడొచ్చు

దద్దుర్లు పుండుగా ప్రారంభమై, ద్రవంతో నిండిన పొక్కుగా అభివృద్ధి చెందుతాయి

పుండ్లు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది

పిల్లలు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఎంపాక్స్‌కు గురయ్యే అవకాశం ఉంది

సాధారణంగా ఈ వ్యాధి సోకిన వారికి వారంలో లక్షణాలు కనిపిస్తాయి. కానీ 21 రోజుల్లోపు ఎప్పుడైనా కనిపించవచ్చు