ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!
ఆరోగ్యకరమైన జీవితం కోసం హెల్త్ టెస్ట్ లు చాలా సహాయపడతాయి.
ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 6 రకాల రక్త పరీక్షలు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
కంప్లీట్ బ్లడ్ కౌంట్..
రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్ల సంఖ్యను తెలియజేస్తుంది. రక్త హీనత, ఇన్ఫెక్షన్లను ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.
కిడ్నీ ఫంక్షన్ టెస్ట్..
మూత్ర పిండాల ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది. మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు తెలుసుకోవచ్చు.
లివర్ ఫంక్షన్ టెస్ట్..
ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల కాలేయ వ్యాధి, హెపటైటిస్, కామెర్లు వంటి సమస్యలను గుర్తించవచ్చు.
థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్..
ఈ పరీక్ష చేయించడం ద్వారా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలను గుర్తించవచ్చు.
లిపిడ్ ప్రోఫైల్ ..
ఈ పరీక్ష రక్తంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను కొలుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని వెల్లడిస్తుంది.
షుగర్ టెస్ట్..
రక్తంలో చక్కెర స్థాయిని కొలవడానికి ఈ పరీక్ష సహాయపడుతుంది. మధుమేహ సమస్యను బయటపెడుతుంది.