అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!

క్వినోవా తక్కువ కార్బోహైడ్రేట్స్ తో అధిక ప్రోటీన్ కలిగిన గ్లూటెన్ ఫ్రీ ధాన్యం.

బార్లీ గోధుమలను పోలిన ధాన్యం. ఇందులో ఫైబర్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

నేరుగా బియ్యం బదులు వాడుకోకపోయినా కాయధాన్యాలను  భోజనంలో చేర్చుకోవచ్చు.  ఇవి ప్రోటీన్,  ఫైబర్ లను అందిస్తాయి.

చియా గింజనలు నానబెట్టి ఉపయోగించవచ్చు. ఇవి జెల్ లాగా మారతాయి. వీటిని ఫుడ్డింగ్ లా తీసుకోవచ్చు.  ఇతర వంటకాలలో ఉపయోగించవచ్చు.

బాదం నూనెను తీయగా మిగిలిన బాదం పిండి గ్లూటెన్ రహితం. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బేకింగ్ లో, ఇతర వంటలలో దీన్ని ఉపయోగించవచ్చు.

బీన్స్ ను ముక్కలుగా చేసి ఉడికించి వివిధ వంటకాలలో ఉపయోగించవచ్చు.

కాలీఫ్లవర్ ను సన్నగా తురిమి బుర్జీ లాగా చేసుకుని తీసుకోవచ్చు. బియ్యానికి సమాన పరిమాణంలో కలిపి తీసుకోవచ్చు.  అనేక విధాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

కాలీఫ్లవర్ రైస్ లాగే బ్రోకలీ తో కూడా రైస్ చేసుకోవచ్చు.