షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే ఉదయం పూట దీనిని తీసుకోండి..!
షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే భయంతో ఏవి తినాలన్నా భయపడుతుంటారు. షుగర్ అదుపులో ఉంచుకోవాలని చాలా వరకూ తిండి తగ్గించేస్తూ ఉంటారు. అసలు దీనికి పరిష్కారంగా..
వేయించిన శనగపిండితో తయారైన సత్తులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు గ్లూకోజ్ ను నెమ్మదించేలా చేస్తాయి. సత్తును రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది.
సత్తు సర్బత్‌లో ఉండే అధిక పీచు పదార్థం ఆకలిని మందగించేలా చేస్తుంది. బరువును తగ్గిస్తుంది
సత్తులో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సివిటీని తగ్గించి గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
సత్తు సర్బత్ సాధారణంగా నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర వంటి సహజమైన పదార్థాలతో తయారుచేస్తారు.
సత్తు సర్బత్ తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు.
సత్తు సర్బత్ తయారుచేయడానికి కాస్త ఓపిక అవసరం. దీనిని సమతుల్య ఆహారంగా గుర్తించి ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.
సత్తు అధిక చక్కెర నియంత్రణలో భాగమైన ఈ పానీయం, మిగతా చక్కెర పానీయాలకంటే భిన్నమైనది. ఆరోగ్యకరమైనది. దీనిని తాగితే మధుమేహం సమస్య చాలా వరకూ కంట్రోల్లో ఉంటుంది.