రోజూ ఈ జ్యూస్ తాగితే.. ఆ సమస్యలన్నీ పరార్
సెలరీ జ్యూస్.. ఇందులో ఫైబర్, విటమిన్స్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలుంటాయి. దీన్ని రోజూ తాగితే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
సెలరీలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. ఈ జ్యూస్ తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
సెలరీ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
సెలరీ జ్యూస్‌లో ఫైబర్స్ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. ఇది మలబద్ధకానికి ఔషధంలా పని చేస్తుంది.
సెలరీ జ్యూస్.. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. చెత్త, వ్యర్థాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. లివర్, కిడ్నీల పనితీరుకు సహాయపడుతుంది.
సెలరీలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచి, అతిగా తినకుండా చేస్తుంది. దీంతో.. బరువు తగ్గుతారు.
సెలెరీ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఈ జ్యూస్ తాగితే.. చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది.
సెలెరీలో అపిజెనిన్, లుటియోలిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. వీటికి క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.
Related Web Stories
గుమ్మడి గింజలను పక్కన పడేస్తున్నారా.. వాటి వల్ల కలిగే లాభాలేంటో తెలిస్తే..
గాడిద పాలు.. పోషకాలు మెండు
చక్కెర వ్యాధిని సహజసిద్ధంగా కంట్రోల్ చేసే వెజ్ ఫుడ్స్!
గడ్డిలో నడిస్తే ఇన్ని లాభాలా..