అవకాడో తినండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఎన్ని లాభాలంటే?

అవకాడోలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.

అవకాడోలోని లుటిన్, షియాక్సింతిన్ అనే పోషకాలు.. కంటి ఆరోగ్యాన్ని కాపాడి, కంటిచూపుని మరింత మెరుగ్గా చేస్తుంది.

అవకాడోలోని పొటాషియం.. రక్తనాళాల సంకోచాన్ని సరిచేసి, రక్తనాళాలను విస్తరిస్తుంది. తద్వారా.. బీపీ కంట్రోల్ అవుతుంది.

అవకాడోలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్.. రక్తనాళాల్లోని చెడు కొలెస్టిరాల్‌ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అవకాడోలోని ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్.. ఆకలి కాకుండా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తాయి. దీంతో బరువు తగ్గుతారు.

ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్.. భాడీలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. దీంతో మంట తగ్గుతుంది.

అవకాడోలోని సూక్ష్మపోషకాలు.. జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా.. మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.