ఈ టైంలో లవంగాలు తింటే.. ఎన్నో ప్రయోజనాలు

వంటలను రుచిగా మార్చే లవంగాల్లో ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రాత్రి పడుకోవడానికి ముందు తీసుకుంటే, చాలా లాభాలుంటాయి.

లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్స్.. నోటిలోని బ్యాక్టీరియాని దూరం చేసి, దంతాలను హెల్దీగా చేస్తాయి. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

లవంగాల్లో యూజినాల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది.

లవంగాలని మెత్తని పొడిలా చేసి, తేనె కలిపి.. ముఖంపై మొటిమలు ఉన్న చోట రాయాలి. వెంటనే మొటిమలు మాయమవుతాయి.

రోజుకి ఒకటి చొప్పున లవంగం తీసుకుంటే.. శరీర బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ట్యాక్సిన్స్‌ని కూడా బయటికి పంపుతుంది.

రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక లవంగాన్ని తింటే.. ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని లవంగాలు బాగా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు తేల్చాయి కాబట్టి.. డయాబెటిస్ పేషెంట్లకు ఇవి మేలు చేస్తాయి.

లవంగాల్లోని విటమిన్ C.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా.. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.