మునక్కాయలు తింటే..
ఈ సమస్యలన్నీ పరార్
వేసవిలో ఎక్కువగా లభ్యమయ్యే మునక్కాయలు మన డైట్‌లో చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మునక్కాయలో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు ఎన్నో పోషకాలుంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి.
మునక్కాయలో ఉండే ఫైబర్ కంటెంట్.. అజీర్ణం, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది.
మునక్కాయలోని ఫైబర్.. చాలాసేపటి వరకూ కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తాయి. దీంతో.. బరువు నియంత్రణలో ఉంటుంది.
మునక్కాయలోని ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేసి.. ఆర్థరైటిస్, అలర్జీ లక్షణాలని తగ్గిస్తాయి.
మునక్కాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ఎండకాలంలో తింటే, డీహైడ్రేషన్ సమస్య రాదు.
మునగలో కూలింగ్ గుణాలున్నాయి. కాబట్టి వీటిని తింటే.. శరీరంలో అధిక చెమట, అలసట, సన్ స్ట్రోక్ వంటివి తగ్గుతాయి.
Related Web Stories
టెస్టోస్టెరాన్ పెంచే పది ఆహారాల గురించి తెలుసా..!
మానసిక స్థితిని పెంచే మూలికలు తెలుసా..!
ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటున్నారా? ఈ ఇబ్బందులు రావొచ్చు..!
30 ఏళ్ల తర్వాత ఈ లక్షణాలు.. కిడ్నీ సమస్యకు సంకేతాలు!