రోజూ పుదీనా తింటే.. ఈ లాభాలు మీ సొంతం!

పుదీనాలో విటమిన్ ఏ, సీ, బీ6, ఐరన్ కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పుదీనాలోని ఔషధ గుణాలు జీర్ణ సమస్యలను నయం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆకులు నమిలితే.. నోరు రీఫ్రెషింగ్‌గా ఉంటుంది. అంతేకాదు.. చిగుళ్లు, దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అలెర్జీ, ఆస్తమా వంటి శ్వాసకోస సమస్యలకు చెక్ పెడతాయి.

పుదీనాలోని యాంటీఆక్సిడెంట్‌ చర్మాన్ని సంరక్షిస్తాయి. ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షించి.. చర్మానికి తాజాదనం తెస్తాయి.

కంటి చూపు మెరుగుపరిచేందుకు తోడ్పడే విటమిన్-ఏ పుదీనాలో ఉంటుంది. కాబట్టి.. దీనిని రోజూ తింటే ఎంతో మంచిది.

పుదీనా ఆకుల్లో ఉండే కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు.. మీ జుట్టుని పెరగేలా చేస్తాయి. జుట్టు రాలకుండా కాపాడుతాయి.

పుదీనాలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారి పడకుండా రక్షిస్తాయి.