తొక్కే కదా అని తీసేయకండి.. దాని లాభాలేంటో తెలుసా?
చాలామంది బంగాళదుంప తొక్కల్ని తీసేసి వండుతుంటారు. అయితే.. తొక్కల్లో కూడా మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలెన్నో ఉంటాయి.
వీటి తొక్కల్లో కొద్దిగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది పేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది. అంతేకాదు.. కొలెస్టిరాల్ స్థాయిల్ని కూడా తగ్గిస్తుంది.
ఈ బంగాళదుంప తొక్కల్లోని ఫైబర్ కంటెంట్.. రక్తంలో గ్లూకోజ్ శోషణని నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్ని సమాంతరం చేస్తుంది.
ఈ తొక్కల్లో ఉండే కరగని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువ తినలేం.
ఆలుగడ్డ తొక్కల్లోని రెసిస్టెంట్ స్టార్చ్.. జీర్ణ వ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పోషిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఈ తొక్కల్లోని కెరోటినాయిడ్స్, విటమిన్ సీ.. కాలుష్య కారకాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మానికి హైడ్రేషన్ అందించి.. మెరిసేలా చేస్తాయి.
వీటి తొక్కల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.
ఆలు తొక్కల్లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్.. ఒత్తిడిని, కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడ్డంలో తోడ్పడుతాయి.
Related Web Stories
క్షణాల్లో వీర్య కణాల సంఖ్యను పెంచే ఆహార పదార్థాలివే
వేసవిలో గర్భిణీలు ఈ డ్రింక్స్ చాలా మంచిది..!
రోజూ బీరు తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..
మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..!