ఈ వైట్ టీ తాగితే..  రెట్టింపు అందం మీ సొంతం

వైట్ టీ.. దీని గురించి చాలా మంది విని ఉండరు. దీనిని కామెల్లియా సినెన్సిస్‌ మొక్క చిగుళ్లతో, మొగ్గలతో తయారు చేస్తారు. 

ఈ వైట్ టీ తాగడానికి కాస్త చేదుగా ఉండొచ్చేమో గానీ.. దీనిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.

వైట్ టీలో ఎపిగాల్లోకాటెచిన్‌ గాలేట్‌ ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు కరిగించి, శరీర బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది.

వైట్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ నుంచి రక్షిస్తాయి. మెరిసే చర్మాన్ని మీకు అందిస్తాయి.

ముఖంపై చర్మం వేలాడుతూ, వృద్ధాప్య ఛాయలు ఉన్నవారు ఈ రెగ్యులర్‌గా వైట్ టీ తాగితే.. యవ్వనంగా తయారవుతారు.

వైట్‌ టీలోని యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు.. గ్లూకోజ్ స్థాయిల్ని తగ్గించి, టైప్‌ 2 డయాబెటిస్‌ను నివారిస్తాయని తెలిసింది.

అజీర్ణం సమస్యలతో బాధపడేవారికి ఈ వైట్ టీ ఒక దివ్యౌషధం. మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలను వెంటనే దూరం చేస్తుంది.

వైట్ టీ తాగితే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా.. హై బీపీ, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదాలు దరిచేరవు.

వైట్ టీ రెగ్యులర్‌గా తాగితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా.. ఇన్ఫెక్షన్‌లు దూరం అవుతాయి.