నల్లద్రాక్షతో ఎన్ని లాభాలో తెలుసా.. ఈ సమస్యలన్నీ పరార్
నల్లద్రాక్షలో విటమిన్ సీ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది.
నల్లద్రాక్షలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, ఎముకల సమస్యలు రాకుండా చేస్తుంది.
నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో.. కొంతవరకు క్యాన్సర్ తగ్గుతుంది.
నల్లద్రాక్షలోని ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు.. కంటి సంబంధిత సమస్యల్ని (క్షీణత, కంటి శుక్లం) తగ్గిస్తాయి.
నల్లద్రాక్షలోని డైటరీ ఫైబర్.. జీర్ణక్రియకి మెరుగుపరుస్తుంది. దీంతో.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి.
కేలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా.. ఫైబర్ ఎక్కువగా ఉండే నల్లద్రాక్ష తింటే.. ఆకలి తగ్గుతుంది. అతిగా తినకుండా, బరువు తగ్గుతారు.
నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్.. మంటతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నల్లద్రాక్షలోని పొటాషియం.. రక్తపోటుని తగ్గించి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. కాబట్టి.. రెగ్యులర్‌గా తింటే బెటర్.
Related Web Stories
ఈ ఆహారాలను వేడి చేసి తింటే.. ఏమవుతుందో తెలుసా..
మరమరాలు తినడం మంచిదేనా?
ఆడవాళ్లు పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
వీటిని తింటే కిడ్నీ స్టోన్స్ పక్కా..!