వేసవిలో క్యారెట్ జ్యూస్ తాగితే.. కలిగే ప్రయోజనాలు ఇవే..

ఎండకాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

కేలరీలు, ప్రొటీన్స్, పిండి పదార్థాలు, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఈ జ్యూస్ తాగితే.. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ జ్యూస్‌లో ఉండే విటమిన్ ఏ, ల్యూటిన్, జియాక్సంతిన్.. కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇతర కంటి సమస్యలు దరిచేరవు.

క్యారెట్ జ్యూస్‌లో ఉండే ఏ, సీ విటమిన్లు.. రోగ నిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడతాయి. ఫలితంగా.. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు.

క్యారెట్ జ్యూస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. కాబట్టి.. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక.

క్యారెట్ జ్యూస్‌లో ఉండే విటమిన్ సీ.. చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులోని కెరొటీనాయిడ్స్.. UV కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

ఈ జ్యూస్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.

ఈ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్.. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని అంతం చేస్తాయి. పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.