యోగాతో ఈ సమస్యలన్నీ దూరం!

ప్రతిరోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

పశ్చిమోత్తాసనం, శవాసన, ప్రాణాయామం, అధోముఖ స్వనాశనాలు చేస్తే.. హైబీపీ నుంచి ఉపశమనం పొందవచ్చు.

కపాలాభాతి, ధనురాసనం, చక్రాసనం వంటి యోగాసనాలు చేస్తే.. రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.

ప్రాణాయామం, ధనురాసనంలతో శ్వాస సమస్యల్ని నివారించవచ్చు. ఈ యోగా ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

తాడాసనా, త్రికోణాసనం, పాదహాసనం, పార్శ్వకోనాసనం వంటివి చేస్తే.. ఊబకాయం వంటి సమస్యలు దూరమవుతాయి.

మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే.. ఉత్తరాసనం, బాలాసనం, శవాసనాలు చేస్తే.. దాన్నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఒత్తిడి కారణంగా కొందరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్యని దూరం చేయడంలో యోగా హెల్ప్ చేస్తుంది.

తరచూ అలసటగా, బలహీనంగా అనిపిస్తే.. యోగా చేయడం శ్రేయస్కరం. అది వెంటనే శరీరానికి శక్తిని అందిస్తుంది.

యోగాలోని పవన్ముక్తాసనం, వజ్రాసనం వంటివి.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి.