పర్పుల్ క్యాబేజీ.. ఇది తింటే ఎన్ని లాభాలో తెలుసా?
పర్పుల్ క్యాబేజీ.. దీన్ని రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. ఇది బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల్లాగే బ్రాసికా కుటుంబానికి చెందింది.
ఈ పర్పుల్ క్యాబేజీలో డైటరీ ఫైబర్స్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉండే పర్పుల్ క్యాబేజీని డైట్‌లో చేర్చుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.
ఈ పర్పుల్ క్యాబేజీని ఉడికించి తింటే.. జీర్ణక్రియ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఈ పర్పుల్ క్యాబేజీలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపుని నిండుగా ఉంచుతుంది. దీంతో బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
ఈ రెడ్ క్యాబేజీలో ఉండే పొటాషియం.. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచి, గుండె వేగాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది.
రెడ్ క్యాబేజీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి.
ఈ పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సీ, విటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి.. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.
పర్పుల్ క్యాబేజ్‌లో ఉండే విటమిన్ కే, పొటాషియం.. ఎముకలు, కండరాల పనితీరును మెరుగుపరచడానికి తోడ్పడుతాయి.
Related Web Stories
ఉబ్బరం తగ్గించి, జీర్ణక్రియను పెంచే ఆయుర్వేద నివారణలు ఇవే..!
చెరకురసం తాగితే.. ఈ సమస్యలన్నీ మటుమాయం
అన్నం బదులు వీటిని తింటే.. బోలెడన్ని లాభాలు
మీరు రోజూ చేసే ఈ 5 తప్పులే.. మీ శరీరానికి శత్రువులు..