చెరకురసం తాగితే..  ఈ సమస్యలన్నీ మాయం

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ జ్యూస్‌లు తాగడానికి ఇష్టపడతారు. వాటిల్లో చెరకురసం తాగితే, ఎంతో శ్రేయస్కరమని నిపుణులు చెప్తున్నారు.

చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. బాడీలో ఉష్ణోగ్రతని తగ్గించి, డీహైడ్రేషన్ సమస్య దూరమయ్యేలా చేస్తాయి.

చెరకురసంలో మూత్రవిసర్జన లక్షణాలుంటాయి. దీని వల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

మన బాడీలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా, వృద్ధి చెందకుండా నిరోధించే గుణం చెరకు రసంలో ఉంది. కాబట్టి, దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

చెరకురసంలో చర్మ రక్షణకు తోడ్పడే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య లక్షణాలు కూడా దూరమవుతాయి.

చెరకురసంలో ఉండే హెల్దీ గుణాలు.. బాడీలోని ట్యాక్సిన్‌ను దూరం చేసి, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి (డాక్టర్ సలహాతో).

శరీర బలాన్ని పెంచి ఇమ్యూనిటీని బలంగా చేసే గుణాలు చెరకురసంలో ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే.. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.

జీర్ణ సంబంధిత బాధలకు, చెరకు రసం డైజెస్టివ్ టానిక్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం.. పొట్టలోని పీహెచ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.