ఈ జ్యూస్ తాగితే..  ఈ సమస్యలన్నీ మాయం

టార్ట్‌ చెర్రీస్‌.. ఇవి సాధారణ చెర్రీల్లాగే ఉంటాయి. రుచిలో కాస్త పుల్లగా ఉంటాయి. ఈ చెర్రీస్‌ని పొడి, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు.

టార్ట్‌ చెర్రీస్‌ జ్యూస్.. ఇందులో మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. కీళ్లనొప్పులు, కండరాల నొప్పులతో ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెప్తున్నారు.

ఈ జ్యూస్‌లో నిద్ర-మేల్కొనే చక్రాలను నియంత్రించే ‘మెలటోనిన్‌’ ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

టార్ట్ చెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. ఆక్సీకరణ ఒత్తిడిని, హైపర్‌టెన్షన్‌ని తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

టార్ట్‌ చెర్రీస్‌లోని న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయి. ఇది అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

టార్ట్ చెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్.. హానికర ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేస్తాయి. ఫలితంగా.. క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గుతాయి.