మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రొస్తుందా.. తస్మాత్ జాగ్రత్త!

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంతమందికి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే.. ఇలా పడుకోవడం శరీరానికి అంత మంచిది కాదు.

ఫుడ్ తిన్నాక బాడీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ ప్రారంభమై, పేగులకి రక్తం సరఫరా అయ్యి, నిద్రలోకి జారుకుంటారు.

ఇలా పడుకుంటే కడుపు బరువుగా అనిపిస్తుంది. దీనికితోడు జీర్ణక్రియ సమస్యలొస్తాయి. గుండెల్లో మంట, ఛాతిలో వెనుక నొప్పి వంటివి వస్తాయి.

తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కేలరీలు బర్న్ అవ్వవు కాబట్టి.. శరీర బరువు పెరుగుతారని నిపుణులు చెప్తున్నారు.

కడుపునిండా తిన్న తర్వాత నిద్రలోకి జారుకుంటే.. గ్యాస్ట్రిక్ సమస్యలు వవస్తాయి. ఫలితంగా.. నిద్రలేమీ బారిన పడతారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేరు.

ఇలాంటి సమస్యలు రాకూడదంటే.. తిన్న వెంటనే పడుకోవద్దు. కొద్దిసేపు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత పడుకుంటే.. కేవలం గంట మాత్రమే నిద్రపోవాలి.

అలాగే.. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పీచుతో కూడిన ఫుడ్స్ తీసుకుంటే ఉత్తమం. ఇవి రక్తస్థాయిల్ని బ్యాలెన్స్ అయి, రాత్రిళ్లలో మంచి నిద్రని ప్రోత్సహిస్తాయి.