నారింజ తొక్కల గురించి మీకు తెలియని నిజాలివి..
నారింజ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల రోజూ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ తొక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు, ఆక్సీకరణ ఒత్తిడి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
నారింజ తొక్కల నుండి తయారైన సారం గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
నారింజ తొక్కలో విటమిన్-సి, యాంటీ మైక్రోబయల్, పాలీపెనాల్స్ పుష్కంలగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
నారింజ తొక్కలో పెక్టిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.
నారింజ తొక్క మధుమేహం ఉన్నవారికి మంచిది. రక్తంలో చక్కెర నియంత్రణలో గొప్పగా సహాయపడుతుంది.
ఆహారంలో నారింజ తొక్క తీసుకుంటే జీవక్రియ వేగం పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మొటిమలు, జిడ్డు చర్మం చికిత్సలో ఆరెంజ్ తొక్కలు ప్రభావవంతంగా ఉంటాయి. చర్మ రంధ్రాలను క్లియర్ చేస్తాయి. చర్మం చికాకును తగ్గిస్తాయి.
నారింజ తొక్కలను సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. ఆస్తమా, బ్రోన్కైటిస్, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు.
ఊపిరితిత్తులలో శ్లేష్మం తొలగించడంలో నారింజ తొక్కలు బాగా సహాయపడతాయి.
నారింజ తొక్కను నీటిలో వేసి టీగా తయారుచేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ బాగుంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
Related Web Stories
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..
ఎరుపు vs ఆకుపచ్చ.. ఏ రంగు యాపిల్ పండు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందంటే..
రోజూ ఒక ఉసిరికాయ తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే!
ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!