చపాతీ భారతీయుల ఆహారంలో ప్రధానం. టిఫిన్, లంచ్, భోజనం.. ఇలా ఎందులో అయినా చపాతీ సెట్ అవుతుంది.
ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయ్యేవారు చపాతీని ఎక్కువగా తింటుంటారు.
చపాతీలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి.
చపాతీలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలు ఆరోగ్యంగా ఉంచుతుంది.
నూనె, నెయ్యి లేకుండా తయారు చేసే గోధుమ రొట్టెలలో ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి.
గోధుమ చపాతీలలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, కండరాల మరమ్మత్తుకు ఇది అవసరం.
చపాతీలలో నియాసిన్, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి.
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గోధుమ చపాతీలు తింటే బరువు తగ్గడం సులువు.
ఇతర పిండులతో చేసిన రొట్టెలతో పోలిస్తే గోధుమ చపాతీలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి మంచిది.
సంపూర్ణ గోధుమ చపాతీలలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
చపాతీలు మరింత ఆరోగ్యకరంగా ఉండాలంటే జొన్న, సజ్జ వంటి పిండులను సమాన పరిమాణంలో కలిపి చపాతీలు చేసుకోవచ్చు.