రోజూ ఎండుద్రాక్షలను ఎందుకు తినాలో చెప్పే 10 కారణాలివే..
ఎండుద్రాక్షలో విటమిన్-బి, సి. ఖనిజాలైన ఐరన్, పొటాషియం, మెగ్నీషియం. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.
ఇవి సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి. ఉదయం లేదా మధ్యాహ్నం పనిలో శక్తి పుంజుకోవడానికి వీటిని తినవచ్చు.
ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఇవి ప్రేగు ఆరోగ్యానికి దోహదపడతాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
వీటిలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.
శుద్ది చేసిన చక్కెరలకు బదులుగా ఆహారంలో ఎండుద్రాక్షలను తీపి కోసం ఉపయోగిస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
ఎండుద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్, ఫాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఫ్రీరాడికల్స్ వల్ల శరీరానికి నష్టం కలగకుండా ఇవి కాపాడతాయి.
వీటిలోని సహజ చక్కెరలు, ఫైబర్ కారణంగా ఎక్కువ సేపు ఆకలి నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.
ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే అనీమియా తగ్గిపోతుంది.