వర్షాకాలంలో  పెరుగు తినకూడదా..  అసలు నిజాలు ఇవే..

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందనేది అపోహ. పెరుగు తినడం వల్ల  ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

వర్షాకాలంలో పెరుగు అజీర్థి కలిగిస్తుందనేది అబద్ధం. ఇది జీర్ణక్రియకు ఎంతో దోహదం చేస్తుంది. 

రాత్రిపూట పెరుగు తినకూడదనేది కూడా అపోహ మాత్రమే. మంచి నిద్రకు పెరుగు సహకరిస్తుంది.

గర్భిణులు కూడా పెరుగు తినొచ్చు. పెరుగులోని లాక్టోబాసిస్లస్ పేగులకు ఎంతో మంచిది. 

పాలిచ్చే తల్లులు పెరుగు తినొద్దు అనేది కూడా అపోహ మాత్రమే. దీని వల్ల పిల్లలకు ఎలాంటి జలుబూ చేయదు.

వర్షాకాలంలో పిల్లలు పెరుగు తినడం వల్ల ప్రొటీన్, కాల్షియం, విటమిన్-డి అందుతుంది. 

అయితే వర్షాకాలంలో పెరుగును  అతిగా తినడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ఇవన్నీ మీకు అవగాహన కోసం మాత్రమే.. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.