మామిడి టెంక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మామిడి గింజను పొడి చేసి, గ్లాసు నీటితో తీసుకుంటే డయేరియా నుంచి ఉపశమనం కలుగుతుంది. 

శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతలో మామిడి టెంక ఎంతో సాయం చేస్తుంది. 

మామిడి గింజల పొడితో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బీపీ అదుపులో ఉంటుంది. 

మామిడి జీడిలోని ఫినాల్స్, ఫినాలిక్ సమ్మేళనాలు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

మామిడి విత్తనం పొడితో శుభ్రం చేసుకుంటే దంతాలు బలంగా ఉండడంతో పాటూ అనేక సమస్యలను దూరం చేస్తుంది. 

చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో మామిడి జీడి ఎంతో బాగా పని చేస్తుంది. 

ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్యం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.