మునగాకు గురించి
నమ్మలేని నిజాలు..
ఆ సమస్యలకు చెక్
అందానికి, ఆరోగ్యానికి మునగాకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలో ఏ, సీ, ఇ విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉన్నాయి
చలికాలంలో చర్మాన్ని మెరిపించడంలో మునగాకు ఎలా సహకరిస్తుందో తెలుసుకుందాం.
మునగాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందులోని పోషకాలు చర్మం మీద పేరుకునే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
వ్యర్థాలన్నీ తొలగి చర్మం కాంతిమంతం అవుతుంది.
ఒక గిన్నెలో గుప్పెడు మునగాకులను వేసి ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి.
తర్వాత ఈ నీటిని వడబోయాలి. దీంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి టోనర్‌లా పనిచేసి చర్మం మృదువుగా మారుతుంది.
మునగాకును తరచూ తినడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరిగి, తేమ అందుతుంది.
చర్మం మీద నిలిచి ఉండే కొవ్వులను కరిగించి మొటిమలు రాకుండా చేస్తుంది.
ముఖం మీద ముడతలు, గీతలు ఏర్పడకుండా నివారిస్తుంది.
అనారోగ్యకారకమైన లక్షణాలు రానీయకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మునగాకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. బాగా ఆరాక మెత్తని పొడిలా చేయాలి.
దీంతో ముఖాన్ని మెల్లగా రుద్దితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.
గుప్పెడు మునగాకులను తీసుకుని నీళ్లు చల్లుతూ మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి.
తర్వాత మంచినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే చర్మ రంధ్రాల్లోని మురికి తొలగిపోతుంది.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ రావు. చర్మానికి మంచి ఛాయ వస్తుంది.
Related Web Stories
దిండు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..
క్యాప్సికం తింటే ఇన్ని ప్రయోజనాలా..
ఎండు ద్రాక్ష నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
వీటిని తినండి....గుండె జబ్బులకు దూరంగా ఉండండి