అల్లం ఎక్కువగా వాడేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి.
అల్లం రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు వంటలకు అదనపు రుచిని జోడిస్తుంది.
విటమిన్-సి, ఫాస్పరస్, ఐరన్, జింక్, క్రోమియం, కాల్షియం అల్లంలో ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా అల్లం ఎక్కువ తినకూడదు.
అల్లంలో ఉండే రసాయన సమ్మేళనాలు కడుపులో చికాకు సృష్టిస్తాయి. జీర్ణాశయాన్ని బలహీనపరుస్తాయి.
అల్లం ఎక్కువ తింటే గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు వస్తాయి.
అల్లం ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి.
అల్లం ఎక్కువ తింటే నోరు మండటం, నోటి అల్సర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
రోజుకు 5గ్రాములకు మించి అల్లం తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే.