వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేందుకు రాత్రి పూట కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. 

మేకప్ వేసుకున్న వారైతే రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌తో తొలగించాలి. 

క్లెన్సింగ్ మిల్క్‌తో శుభ్రం చేయడం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది.

రాత్రి పడుకునే ముందు చల్లని నీటితో మొఖాన్ని కడుక్కోవాలి. 

పడుకునే ముందు రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ మిక్స్ చేసి మొఖానికి రాసుకోవాలి. 

రాత్రి వేళ మొఖానికి రాసుకునే మాయిశ్చరైజన్లను అప్లై చేసుకోవాలి. 

చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఆల్కహాల్ లేని టోనర్‌ని ఉపయోగించండి.

చర్మం తేమగా, శుభ్రంగా ఉంచడం వల్ల చర్మ కణాలు శ్వాస తీసుకోవడానికి వీలుంటుంది.

పై విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.