నిమ్మకాయల గురించి  మీకు తెలియని నిజాలు.

నిమ్మకాయలలో  విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

 దగ్గు, ఫ్లూ సమస్యలు తగ్గిస్తాయి.  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్లాసు వేడినీటిలో నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకుంటే మంచిది.

బరువు తగ్గించే ప్రయత్నాలు చేసేవారికి నిమ్మకాయ సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా 12వారాల పాటు నిమ్మరసాన్ని తీసుకుంటే బరువులో మార్పు ఉంటుంది.

తీసుకునే ఆహారంలో ఐరన్ శరీరానికి అందాలన్నా విటమిన్-సి ముఖ్యం. నిమ్మకాయలలో ఐరన్, విటమిన్-సి రెండూ రక్తహీనతను తగ్గిస్తాయి.

విటమిన్-సి గొప్ప యాంటీఆక్సిడెంట్.  శరీరంలో రాడికల్స్ ను,  ట్రైగ్లిజరైడ్ స్థాయిని  తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.

చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని విటమిన్-సి ప్రోత్సహిస్తుంది. దీంతో యవ్వనంగా ఉంటారు.