సోంపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా తింటే మాత్రం కొన్ని నష్టాలు ఉన్నాయి. అవేంటంటే..

రెగ్యులర్‌గా మందులు వాడే వారు సోంపు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

పిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా సోంపు తినకూడదు. ఇది పిల్లల ఆరోగ్యంపై పడొచ్చు.

సోంపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీ వస్తుంది.

సోంపు అతిగా తినడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.

సోంపును పదే పదే తినడం వల్ల కడుపు నొప్పి సమస్య తలెత్తే ప్రమాదం కూడా ఉంది.

సొంపును అతిగా వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.

సోంపు గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్ల కారణంగా బరువు పెరుగుదలకు దారి తీయవచ్చు.