ఈ 6 కూరగాయలు తింటే చాలు.. 15రోజుల్లో పొట్ట కొవ్వు మాయం!
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న కారణంగా అధికంగా తినాలనే కోరికను నియంత్రించి ఈజీగా బరువు తగ్గించే కూరగాయలున్నాయి.
పుట్టగొడుగులు
పుట్టగొడుగుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచి, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడం ద్వారా 15రోజుల్లోనే బరువులో మార్పులు తెస్తాయి.
గుమ్మడికాయ
గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. చాలావేగంగా బరువు తగ్గిస్తుంది.
బ్రోకలి
బ్రోకలిలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ పొట్ట కొవ్వును వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.
ఆకుకూరలు
ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, కూరగాయలలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే 15రోజుల్లో బరువులో మార్పులుంటాయి.
దోసకాయ
శరీరాన్ని శుద్ది చేయడానికి దోసకాయ మంచిది. క్రమం తప్పకుడా దోసకాయ జ్యూస్ తాగడం లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే కొవ్వు వేగంగా తగ్గుతుంది.
క్యారెట్
క్యారెట్ లలో తక్కువ కేలరీలు ఉంటాయి. రోజూ గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగినా, సలాడ్ గా తిన్నా వేగంగా పొట్ట తగ్గుతుంది.