కొన్ని రకాల ఆహారాలు మీ కుక్కల ఆహారాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. అవేంటంటే.. 

సరిగా పండని టమాటో ఆకుపచ్చ భాగాల్లో ఉండే సోలనిన్ అనే పదార్థం కుక్కలకు హానికరంగా మారుతుంది. 

అవోకాడోలోని పెర్సిన్ అనే పదార్థం కుక్కల్లో వాంతులు, విరేచనాలకు దారి తీయొచ్చు. 

రేగు పండ్లు కూడా కుక్కలకు అనారోగ్యానికి కారణమవుతాయి. 

చెర్రీస్ గుంటల్లో ఉండే సైనెడ్ విషపూరితంగా మారొచ్చు. 

నిమ్మ వంటి సిట్సస్ పండ్లు కుక్కల్లో కడుపునొప్పికి దారి తీస్తాయి. 

పీచెస్ పండ్లు ఎక్కువ తింటే వాటి గుంటల్లో ఉండే సైనెడ్ కుక్కల్లో జీర్ణాశయ సమస్యలను కలిగిస్తుంది. 

ద్రాక్ష, ఎండు ద్రాక్ష తినడం వల్ల కుక్కల్లో కిడ్నీ వైఫల్యానికి దారి తీసే ప్రమాదం ఉంది.